సినీ కాంప్లెక్స్లో కాల్పుల కలకలం

23 Jun, 2016 20:25 IST|Sakshi
సినీ కాంప్లెక్స్లో కాల్పుల కలకలం

ఫ్రాంక్ఫర్డ్(జర్మనీ):
జర్మనీలోని ఓ సినీ కాంప్లెక్స్ లో దుండగుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఫ్రాంక్ఫర్డ్లోని వీర్న్హ్యిమ్ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆగంతకుడు ముసుగు ధరించి ఆయుధాలతో కాంప్లెక్స్లోకి దూసుకొచ్చి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 50 మందికి పైగా గాయాలయినట్టు సమాచారం. సినీ కాంప్లెక్స్ను పోలీసులు చుట్టుముట్టి దుండగుడిని కాల్చిచంపారు.
 

మరిన్ని వార్తలు