ఉలిక్కి పడుతున్న నమో: ఆజాద్

5 Feb, 2014 20:49 IST|Sakshi
ఉలిక్కి పడుతున్న నమో: ఆజాద్

బెంగళూరు: ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారత దేశ ప్రధాని కాకుండా రెండుసార్లు గాంధీ కుటుంబం అడ్డుకుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తిప్పికొట్టారు. తమ పార్టీలో ఏం జరిగినా కొంత మంది ఉలిక్కి పడుతున్నారని మోడీని పరోక్షంగా ఎద్దేవా చేశారు.

తమ పార్టీలో జరుగుతున్న దానిపై భయపడాల్సిన పని లేదని హితవు పలికారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సెన్స్ 18వ స్నాతకోత్సవంలో ఆజాద్  పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు కూటములు కట్టడం తప్పుకాదని మూడో ఫ్రంట్పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి కూటమి ఏర్పాటు చేసే హక్కు ఉందని, నాయకులు తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ ఉందని ఆజాద్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు