ట్యూషన్కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్

8 Jan, 2015 14:33 IST|Sakshi
ట్యూషన్కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్

ఢిల్లీ శివార్లలో మరో ఘోరం జరిగింది. ఘజియాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలిక ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక.. ప్రైవేటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్కార్పియో వాహనంలో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు.

ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ట్యూషన్కు వెళ్తుంది. బాధితురాలు నిందితులను గుర్తించిందని పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు