వెండి ధగ ధగ

29 Jul, 2016 10:29 IST|Sakshi
వెండి ధగ ధగ

ముంబై: అమెరికా ఫెడ్  రిజర్వ్ వడ్డీ రేట్ల యధాతథంగా ఉంచాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో బులియన్ మార్కెట్ సానుకూలంగా స్పందించింది. విలువైన మెటల్స్  ధగధగ లాడుతున్నాయి. ముఖ్యంగా వెండి, బంగారు ధరల్లో వేగం పుంజుకుంది.  నిన్నటి జోరు శుక్రవారం  కూడా కొనసాగుతోంది.   బంగారం 31వేల రూపాయల మార్క్ ను దాటగా వెండి కిలో  47వేల రూపాయలకు పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది.  ఎంసీఎక్స్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 375  లాభపడి రూ. 47375 దగ్గర ఉంది.  

హైదరాబాద్‌లో నిన్నటి బులియన్‌ మార్కెట్ లో  వెండి కిలో రూ.48,300 ను తాకింది.  ప్రపంచ మార్కెట్ల సానుకూల  సంకేతాలు, ముఖ్యంగా  పారిశ్రామిక అవసరాలు, నాణేల తయారీకి వెండి కొనుగోళ్లు పెరగడంతో వెండి ధగధగలాడింది. దేశ రాజధాని ఢిల్లీలో  గురువారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1,550  పెరిగి రూ.47,750కి చేరిందని పీటీఐ పేర్కొంది. మరోవైపు  వడ్డీరేట్ల పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామన్న ఫెడ్  ప్రకటన  డాలర్‌  విలువను బలహీన పర్చింది.  ఫలితంగా దేశీయ కరెన్సీ బలపడంతో పాటు, పసిడి, వెండిలపై ఇన్వెస్టర్ల  పెట్టుబడులు  మళ్లాయని  బులియన్ మార్కెట్ వర్గాల అంచనా.

 

మరిన్ని వార్తలు