ఆది గోద్రెజ్ రాజీనామా...కీలక మార్పులు

2 Feb, 2017 15:25 IST|Sakshi
ఆది గోద్రెజ్ రాజీనామా...కీలక మార్పులు

ముంబై: రియాల్టీ  సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌ కంపెనీ నాయకత్వంలో కీలక మార్పులను  ప్రకటించింది. గోద్రెజ్ గ్రూపు ఛైర‍్మన్‌ ఆది గోద్రెజ్ గోద్రెజ్  ప్రాపర్టీస్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇకపై ఆయన సంస్థ గౌరవ చైర్మన్  వ్యవహరించనున్నారు.  ఛైర‍్మన్‌  బాధ్యతలను ప్రస్తుత ఎండీ, సీఈవో  పిరోజ్‌ షా గోద్రెజ్  చేపట్టనున్నారు.   అలాగే ఫిరోజ్‌ షా   స్థానంలో  మోహిత్ మల్హోత్రా  మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో, గా ఆయన బాధ్యతలు  నిర్వహిస్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మోహిత్ మల్హోత్రా  ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ గా  పనిచేస్తున్నారు.  నాయకత్వం లో అన్ని మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

ఆది గోద్రెజ్ కుమారుడు, ఫిరోజ్‌ పెన్సిల్వేనియా, వార్టన్ బిజినెస్ స్కూల్ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ స్కూల్ (ఎస్‌ఐపీఏ) నుండి అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్ డిగ్రీ పట్టాపొందారు.  కొలంబియా బిజినెస్  స్కూల్ నుంచి ఎంబిఎ చేశారు.  2004 లో సంస్థ చేరిన ఫిరోజ్‌ షా, 2012 నుండి మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో నియమితులున్నారు.
మల్హోత్రా 2010 లో గోద్రెజ్ ప్రాపర్టీస్  కంపెనీలో చేరారు. అనేక ఎఫ్ఎంసిజి, ప్రైవేట్ ఈక్విటీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రదేశంలో పలు ప్రముఖ కంపెనీల్లో  పనిచేశాసిన అనుభవం ఆయనకుంది. ప్రస్తుతం గోద్రెజ్ ఫండ్ మేనేజ్మెంట్ హెడ్‌గా ఉన్న బలారియా ను గోద్రెజ్ ప్రాపర్టీస్ యొక్క అనుబంధ సంస్థకు సీఈవోగా పదోన్నతి కల్పించింది.

ఈ పరిణామాలపై  ఛైర్మన్ ఆది గోద్రెజ్, గోద్రెజ్ గ్రూప్ వ్యాఖ్యానిస్తూ, పిరోజ్షా, మోహిత్,  గోద్రెజ్ ప్రాపర్టీస్ టీమ్‌  క్లిష్ట మార్కెట్ వాతావరణంలో కూడా మంచి ఫలితాలు  సాధించారన్నారు.  తాను ఖచ్చితంగా  సంస్థను ముందుండి నడిపిస్తానన్నారు.  రాబోయే దశాబ్దాలలో భారత రియల్ ఎస్టేట్  రంగంలో  గోద్రెజ్ ప్రాపర్టీస్  కు అనేక అద్భుతమైన అవకాశాలు  రానున్నాయని అన్నారు. ఈ కొత్త టీం ఆధ్వర్యంలోనే  ఈ అవకాశాలను అందిపుచ్చుకుని,   సంస్థను ఒక అసాధారణ సంస్థగా నిర్మించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది.  క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో  రెట్టింపు నికర లాభాలను సాధించి.  రూ. 77 కోట్ల లాభాలను నమోదు చేసింది. గతేడాది క్యూ3లో రూ. 27 కోట్లు మాత్రమే.  మొత్తం ఆదాయం  రూ. 247 కోట్ల నుంచి రూ. 518 కోట్లకు జంప్‌చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నిర్వహణ లాభం రూ. 6 కోట్ల నుంచి రూ. 121 కోట్లకు దూసుకెళ్లగా, పన్ను వ్యయాలు రూ. 7 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెరిగాయి.  దీంతో గురువారం నాటి మార్కెట్లో   గోద్రెజ్‌ ప్రాపర్టీస​ దూసుకుపోయింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో భారీ లాభాల్లో కొనసాగుతోంది.

 

మరిన్ని వార్తలు