బంగారం ధరలు మరింత దిగి వస్తాయా?

26 Apr, 2017 13:33 IST|Sakshi
బంగారం ధరలు మరింత దిగి వస్తాయా?

ముంబై: బంగారం ధరలు మరింత పతనం దిశగా కదులుతున్నాయి.  బలహీనమైన అంతర్జాతీయ ధోరణికారణంగా గ్లోబల్‌ మార్కెట్లలో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి.   ముఖ్యంగా ఫ్రాన్స్ తరువాతి అధ్యక్షుడిగా  ఇమ్మాన్యూల్ మాక్రోన్   ఎన్నిక కానున్నారనే అవుతుందనే అంచనాలు ,  అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలకుతోడు బ్లూచిప్స్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడుకున్న స్టాక్స్‌లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.  దీంతో బంగారం ఫ్యూచర్స్ పది గ్రాముల రూ. 121 నుంచి రూ .28,693  స్థాయికి పడిపోయింది.   అలాగే మరో విలువైన లోహం వెండి సైతం  ఫ్యూచర్స్‌ మార్కెట్‌ లో  వెండి ధర కిలోధర రూ. 149 లు క్షీణించి  రూ.40,778గాఉంది.

ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) 0.2 శాతం క్షీణించి 1264 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  తద్వారా  రెండు వారాల  కనిష్టాన్ని నమోదు చేసింది.  వెండి కూడా ఔన్స్‌ స్వల్ప క్షీణతతో  17.65 డాలర్లకు చేరింది.  

ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడటంతో ఇన్వెస్టర్లు పసిడి వంటి రక్షణాత్మక పెట్టుబడుల నుంచి స్టాక్స్‌, బాండ్లు వంటి సాధనాలవైపు దృష్టి మరల్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.   అంతేకాదు  ఇవిమరింత క్షీణించే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. సిల్వర్‌ లో కూడా  ఇదే ధోరణి ఉండొచ్చని భావిస్తున్నారు. సిల్వర్‌ ఓన్స్‌ 17 డాలర్లకు దిగివచ్చే చాన్స్‌ ఉందని  చెబుతున్నారు.   ట్రేడింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని  సూచిస్తున్నారు.

అటు దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డ్‌ స్థాయిలను నమోదు చేస్తూ   దూసుకుపోతున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌ 30 వేలు దాటగా, నిఫ్టీ 9350 వద్ద ఆల్‌టైం హైని దాటి  స్థిరంగా ఉన్నాయి. దీనికితోడు డాలర్‌ మారకంలో రుపీ 20 నెలల గరిష్టాన్ని నమోదు చేసి తొలిసారి రూ.64 దిగువకు చేరడం విశేషం.  
 

మరిన్ని వార్తలు