రూపాయి క్షీణతతో పసిడి దూకుడు..

29 Aug, 2013 00:53 IST|Sakshi
రూపాయి క్షీణతతో పసిడి దూకుడు..

ముంబై: రూపాయి బలహీనతే ప్రధాన కారణంగా పసిడి పరుగులు పెడుతోంది. దేశంలోని ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్ ముంబైలో పూర్తి స్వచ్ఛత పసిడి 10గ్రాముల ధర బుధవారం రూ.700 ఎగసి రూ. 33,430కి చేరింది. ఆభరణాల పసిడి ధర రూ.630 పెరిగి రూ.33,265కు ఎగసింది. ఇక్కడ మార్కెట్లో ఈ ధరలు ఆల్‌టైమ్ రికార్డు చేసుకున్నాయి. వెండి ధర కూడా రికార్డు స్థాయిలో ఎగసింది.
 
 ఒకేరోజు కేజీ వెండి ధర రూ.2,800 ఎగసి రూ. 59,470కి చేరింది. దేశంలోని పలు బులియన్ మార్కెట్లలో సైతం మేలిమి బంగారం ధరలు రూ.32,000-రూ.32,500 శ్రేణిలో ఉన్నాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో కడపటి సమాచారం మేరకు ఔన్స్(31.1గ్రా) పసిడి ధర క్రితం ముగింపు వద్దే  1,420 డాలర్ల వద్ద ఉంది. వెండి కూడా అదే స్థాయిలో 25 డాలర్ల వద్ద ఉంది. దేశీ యంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో కడపటి సమాచారం మేరకు పసిడి స్వల్ప లాభాలతో రూ.33,900 వద్ద ట్రేడవుతోంది. వెండి రూ.560 ఎగసి రూ.56,730 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు