మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు!

12 Dec, 2016 14:48 IST|Sakshi
మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు!
ముంబై : గత కొన్ని రోజులుగా తగ్గుముఖంగా ఉన్న బంగారం ధరలు సోమవారం రికవరీ అయ్యాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లో నెలకొన్న తాజా డిమాండ్తో బంగారం ధరలు ఎగిశాయి. వెండి సైతం స్వల్పంగా లాభపడింది. శుక్రవారం రూ.29,160గా ఉన్న 99.5 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర నేటి మార్కెట్లో రూ.135 రూపాయలు లాభపడి రూ.29,295గా నమోదైంది. అదేవిధంగా 10 గ్రాముల ప్యూర్ బంగారం ధర రూ.29,445గా ఉంది. వెండి ధర సైతం స్వల్పంగా రూ.35 ఎగిసి కేజీ రూ.41,800 వద్ద ముగిసింది.
 
డాలర్ షాక్తో ఐదున్నర కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధరలు గ్లోబల్గా పునరుద్ధరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలతో డాలర్ విలువ బలపడుతూ వస్తోంది. దూసుకుపోతున్న డాలర్ కొంచెం నెమ్మదించే సరికి, బంగారం ధరలు పునరుద్ధరించుకోవడం ప్రారంభించాయి. స్పాట్ గోల్డ్ ధరలు అంతర్జాతీయంగా ఒక ఔన్స్కు 1,214.21 డాలర్లు ఎగిశాయి. సిల్వర్ సైతం 16.67 డాలర్లు పెరిగింది. 
మరిన్ని వార్తలు