ఆధిక్యంలో ట్రంప్: భగ్గుమంటున్న బంగారం

9 Nov, 2016 09:13 IST|Sakshi
ఆధిక్యంలో ట్రంప్: భగ్గుమంటున్న బంగారం
వైట్ హౌస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో పసిడి పరుగులు తీస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను అధిగమించి దూసుకుపోతుండటంతో, బంగారం 3 శాతం జంప్ చేసి ఐదు వారాల గరిష్టానికి నమోదవుతోంది. బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావిస్తున్న ఇన్వెస్టర్లు, పెట్టుబడులను దానిలోకి తరలిస్తున్నారు.. దీంతో బులియన్కు ఫుల్ జోష్గా ఉంది. స్పాట్ గోల్డ్ ఒక్క ఔన్స్కు 2.9 శాతం పెరిగి 1,311 డాలర్లుగా నమోదవుతోంది. బులియన్ కూడా 1,312.80 డాలర్లకు ఎగిసింది. అక్టోబర్ 4 తర్వాత ఇదే బలమైన నమోదు. ట్రంప్ గెలిస్తే, కమొడిటీలకు లబ్ది చేకూరుతుందని ముందు నుంచి భావిస్తూ రావడంతో, బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి.
 
అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మూడోవంతు ఓటింగ్ ప్రకియ ముగిసింది. కీలకరాష్ట్రాల్లో ఓటింగ్ నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. ఎన్నికల ఫలితాలు కూడా అంచనాలు తారుమారు చేస్తూ వస్తున్నాయి. హిల్లరీ గెలుస్తుందని ముందస్తు అంచనాలు ప్రకటించినప్పటికీ, ఆమెను అధిగమించి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తారుమారు చేస్తున్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్తో, అమెరికా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆసియన్ మార్కెట్లోనూ డాలర్ భారీగా పతనమవుతోంది. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభమవచ్చని విశ్లేషకులంటున్నారు. 
>
మరిన్ని వార్తలు