పుంజుకుంటున్నపుత‍్తడి

24 Mar, 2017 15:40 IST|Sakshi
పుంజుకుంటున్నపుత‍్తడి

న్యూఢిల్లీ: జ్యువెలర్స్ కొనుగోళ్లతో దేశీయంగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. బులియన్‌ మార్కెట్లో పది గ్రా. పుత్తడి రూ.350పైగా ఎగిసి రూ. 29,350 వద్దఉంది  అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్‌  ఉన్నప్పటికీ  స్థానికదుకాణదారుల నుంచి  డిమాండ్‌ బాగా ఉండడంతో పుత్తడి ధరలు పాజిటివ్‌గా ఉన్నాయి. 

అటు మరో విలువైన లోహం వెండి ధరలు కూడా బాగానే పుంజుకున్నాయి.  పరిశ్రమ వర్గాలనుంచి,  నాణేల తయారుదారులనుంచి డిమాండ్‌ పుంజుకోవడంతి వెండి కేజీ ధర రూ. 125 పెరిగి రూ. 41,375 వద్ద ఉంది.  వీక్లీ ఆధారిత డెలివరీ రూ.60 లాభపడి కిలో. రూ. 41,260 వద్ద ఉంది. దేశరాజధానిలో 99.9  స్వచ్ఛత కలిగిన బంగారం ధరల కూడా తిరిగి పుంజుకుంది.  గురువారం నాటి ధరలతో పోలిస్తే రూ.350పెరిగి రూ.29.350 వద్ద ఉంది.   సావరీన్‌ గోల్డ్‌ కూడా రూ.100 పెరిగి  ఎనిమిదిగ్రాముల బంగారం 24,400 వద్ద ఉంది.


కాగా ప్రపంచవ్యాపితంగా బంగారం ధర 0.22శాతం  పడిపోయింది. సింగపూర్లో ఒక ఔన్స్ ధర రూ.1,241.90 గా ఉంది.
అటు ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో  కూడా  పుత్తడి ధరల బలహీనత కొనసాగుతోంది. రూ.45 లు క్షీణించిన పది గ్రా. పుత్తడి రూ.28,750 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు