బంగారం @రూ.30 వేలు

8 Feb, 2017 12:29 IST|Sakshi
బంగారం @రూ.30 వేలు

అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధరలు వరుస సెషన్లలో పరుగులు పెడుతున్న డాలర్‌   బలపడటంతో బుధవారం  గరిష్టస్థాయి నుంచి  కొద్దిగా క్షీణించాయ. ట్రంప్‌ వివాదాస్పద నిర్ణయాల కారణంగా  డాలర్‌ విలువ నేలచూపులు చూస్తుండడంతో ఈ విలువైన మెటల్‌ కు డిమాండ్‌ పుంజుకోవడంతో  మంగళవారం మూడునెలల గరిష్టాన్ని తాకింది.  స్పాట్‌ గోల్డ్‌ 0.1 శాతం పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,234 డాలర్లు గా నమోదైంది.

అయితే అమెరికా, యూరోప్‌ లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్తితుల కారణంగా డాలర్‌ బుధవారం కొద్దిగా బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌​ 0.2శాతం ఎగిసి 100.510వద్ద ఉంది. అమెరికాలో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ లో 0.2 శాతం క్షీణించి 1,231డాలర్ల వద్ద ఉంది. వెండి ధరలు కూడా ఇటీవలి గరిష్టంనుంచి స్వల్పంగా  0.1శాతంక్షీణించి  17.69 డా డాలర్లుగా ఉంది.    ప్లాటినం  0.6శాతం ఎగిసి 1,007.20 డాలర్లుగా ఉండగా పల్లాడియం 0.1 శాతం బలహీనంగా ఉంది.  
ట్రంప్‌ విధించిన  ఏడు ముస్లిం మతం  దేశాలనుంచి ప్రజలపై ట్రంప్స్ తాత్కాలిక  వీసా బ్యాన్‌ నిషేధం వివాదం,  రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఐరోపాలో రాజకీయ అనిశ్చితి  నేపథ్యంలో  డాలర్ డిమాండ్‌ క్షీణిస్తోంది.  దీంతో   సురక్షిత పెట్టుబడిగా  భావించే పసిడిపై  బులియన్  మార్కెట్లో ఆసక్తి నెలకొంది. అయితే జనవరి సీపీఐ డాటాపై  పసిడి పరుగు ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

ఇటు దేశీయం కూడా మూడునెలల గరిష్టాన్ని తాకిన బంగారం ధర పదిగ్రా. రూ.30వేల స్థాయిని తాకింది.   బుధవారం డాలర్‌  బలపడడంతో మూడునెలల గరిష్టం నుంచి బంగారం ధరలు కొద్దిగా వెనక్కి తగ్గాయి.  ముంబై మార్కెట్‌లో 22 కారెట్ల బంగారం ధర పది గ్రా. రూ. 28540 ఉండగా, 24 కారెట్ల ధర రూ. 30524 వద్ద ఉంది.  ఢిల్లీలోరూ. 28400 ( 22 కారెట్లు పదిగ్రా.), రూ.30374 (24 కారెట్లు పదిగ్రా.) గా వుంది. హైదరాబాద్‌లో రూ. 28310  (22 కారెట్లు పదిగ్రా.) రూ. 30278 ( 24 కారెట్లు పదిగ్రా.)గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం  పసిడి పది గ్రా. రూ.47 నష్టపోయి  రూ.29,285 పలుకుతోంది.  
 

మరిన్ని వార్తలు