జీవోఎం చివరి సమావేశం ప్రారంభం

3 Dec, 2013 17:46 IST|Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి జీవోఎం సభ్యుల చివరి సమావేశం ప్రారంభమైంది. ఈ సభకు కేంద్ర మంత్రుల బృందం పూర్తి స్తాయిలో హాజరైంది.  విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు.  ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్ర జరుగుతున్న ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం.

 

విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై కేంద్ర జీఓఎంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు