ఈ బీరుతో మంచి ఆరోగ్యం

30 Jun, 2017 01:59 IST|Sakshi

సింగపూర్‌: బీరు ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అంటే బీరు ప్రియులు మాత్రం ఆరోగ్యానికి మంచిదే అని గట్టిగా చెబుతారు. ఇప్పటివరకు ఏమోకానీ ఇకపై ఆరోగ్యానికి మంచి చేసే బీరును సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాము తయారు చేసిన బీరు తాగడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడం తోపాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుందని సింగపూర్‌ నేషనల్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు.

జీవించి ఉన్న బ్యాక్టీరియా (ప్రొబయోటిక్స్‌) లాక్టోబా సిల్లస్‌ పారాకేసేయ్‌ అనే బ్యాక్టీరియా మనిషి పేగుల్లో ఉంటూ.. శరీరంలోని టాక్సిన్లు, వైరస్‌లను తొలగించ డంతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ తరహా బ్యాక్టీరియాతోనే తాము బీరును తయారు చేసినట్లు వివరించారు. సాధారణంగా ఆహా రం, పానీయాల్లో జీవించి ఉన్న బ్యాక్టీరియాలు ఆరోగ్యా నికి మంచి చేస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది.

మరిన్ని వార్తలు