మరోసారి ఇండియాకు గూగుల్ సీఈవో

27 Dec, 2016 20:30 IST|Sakshi
మరోసారి ఇండియాకు గూగుల్ సీఈవో

న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో  సుందర్ పిచాయ్ మరోసారి  ఇండియాకు రానున్నారు.  ఢిల్లీలో  జనవరి  4 నిర్వహిస్తున్న   స్మాల్ అండ్ మీడియం బిజినెస్  నిర్వహిస్తున్న ఒక  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరునున్నారు.  ఈ ఈవెంటలో   కేంద్ర  ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్  సహా ఇతర  గూగుల్ సీనియర్  అధికారులు   కూడా పాల్గొననున్నారు.
 
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో చాలా చురుకుగా ఉన్న గూగుల్   దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులకు ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తోంది. టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర  అని ఇటీవల ప్రకటించిన సుందర్  పిచాయ్ భారత్ లోని  డిజిటల్ పవర్ ద్వారా  ఎస్ఎంబీ-గూగుల్ భాగస్వామ్యంపై దృష్టిపెట్టనున్నారు.  ఈ దిశగా ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్ కలిసి  ఇప్పటికే పనిచేస్తున్నాయి.   మరోవైపు గూగుల్ భాగస్వామ్యంతో రైల్వే శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ ద్వారా దేశంలోని సుమారు 400  రైల్వే  స్టేషన్లలో  ఉచిత వై ఫై  సదుపాయాన్ని కల్పించింది.  2017 చివరి నాటికి దేశంలోని మరో 400 ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-ఫై సదుపాయం కల్పిస్తామని రైల్వే వర్గాలు వెల్లడించింది.

కాగా గుగూల్  సీఈవో అయిన తరువాత సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్ లో భారత్ లో పర్యటించారు.  అలాగే ఈ నియామకానికి కొద్ది రోజులు ముందు  ఆండ్రాయిడ్  హెడ్ గా  ఇండియాను  సందర్శించారు.
 

మరిన్ని వార్తలు