అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్

4 Jan, 2017 23:09 IST|Sakshi
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్

న్యూఢిల్లీ:  భారత పర్యటనకు  విచ్చేసిన  ఇంటర్నెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చిన్న వ్యాపారస్తులకు ఆఫర్లను ప్రకటించారు.  ఢిల్లీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సమావేశంలో  బుధవారం  పాల్గొన్న ఆయన గూగుల్ కంటే కూడా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి  ఇక్కడికి వచ్చానని తెలిపారు.  గూగుల్  ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులకు   శిక్షణ ఇవ్వనున్నట్టు  తెలిపారు.  ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ సమాఖ్య  కంపెనీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయి రాబో్యే  మూడు సంవత్సరాలుగా భారతదేశంలో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్ లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.  

భారతదేశ సమస్యల్ని అధిగమిస్తే ప్రపంచానికి పరిష్కారాలు చూపించినట్టేనని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు.   అందరికీ ఉచిత ఇంటర్నెట్ అందించడమే గూగుల్ లక్ష్యమన్నారు.  దాదాపు ఇండియాలో దేశ వ్యాప్తంగా 100  రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నట్టు పేర్కొన్నారు.  ఈ కృషిలో భాగంగా గడిచిన 18 ఏళ్ళలో మెజార్టీ ప్రజలకు తమ  సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.  

ఇంటర్నెట్ ద్వారా  ఏ వ్యాపారస్తుడైనా రిజిస్టర్ చేసుకొని శిక్షణ పొందొచ్చని తెలిపారు.  అలాగే వారు ఉచితంగా సాధారణ వెబ్సైట్ సృష్టించుకోవచ్చన్నారు. దీనికోసం . వారు చేయవలసిందల్లా ఒక స్మార్ట్ ఫోన్ మరియు కొన్నినిమిషాల సమయాన్ని కేటాయింపు అని  చెప్పారు. రిజిస్టర్  చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు.

ముఖ్యాంశాలు
  • చెన్నై లో చిన్నప్పుడు , నేను సమాచారం కోసం  వెదుక్కున్నాను.
  • నేడు  చిన్న పిల్లవాడు వీలైనంత సమాచారాన్ని  యాక్సెస్ చేయవచ్చు.
  •  భారతదేశం లో చాలా చిన్న వ్యాపారులు  ఇంటర్నెట్ ప్రతి ఒక్కరిదీ అనుకోవాలి.
  • కావాలనుకున్నవారందరికీ  నాణ్యమైన డిజిటల్ శిక్షణ అందుబాటులో
  • డిజిటల్ అన్లాక్  ప్రోగ్రామ్  గా  దీన్ని  పిలుస్తున్నాం.
  • భారతదేశం లో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్స్  




 

>
మరిన్ని వార్తలు