కొన్ని పోర్న్ సైట్లకు ఓకే

6 Aug, 2015 09:53 IST|Sakshi
కొన్ని పోర్న్ సైట్లకు ఓకే

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా అశ్లీల వెబ్సైట్లపై పంజా విసిరిన కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనలో మార్పు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 857 అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం విధించిన కేంద్రం వీటిలో కొన్ని సైట్లపై నిషేధం ఎత్తివేయాలనుకుంటోంది. అయితే, బాలలకు సంబంధించిన అశ్లీల వెబ్సైట్లపై నిషేధం మాత్రం కొనసాగించాలని భావిస్తోంది.

ప్రభుత్వం అశ్లీల వెబ్సైట్లపై నిషేధం విధించాలని నిర్ణయించినప్పటి నుంచి భిన్నవాదనలు తలెత్తాయి. వాటిని తిరిగి కొనసాగించాలని కొందరు.. కేంద్ర ప్రభుత్వం మంచి చేసిందని మరికొందరు అభిప్రాయాలు వెలువరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్య ప్రశ్నాత్తకమవుతుందని కూడా విమర్శించారు. ముఖ్యంగా సామాజిక అనుసంధాన వేడుకల్లో కేంద్రం ప్రభుత్వ తీరును చాలామంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మరోసారి తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసుకునే ఆలోచనలో కేంద్రం పడింది.

మరిన్ని వార్తలు