'దేశ' ఎజెండానే రామ మందిర నిర్మాణం!

17 Oct, 2014 14:34 IST|Sakshi
'దేశ' ఎజెండానే రామ మందిర నిర్మాణం!

లక్నో:అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది దేశ ప్రజల అభిలాషని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) స్పష్టం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి చాలా సమయం ఉందని ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ తెలిపారు. చట్టపరిధిలో రామమందిరం నిర్మించడానికి ప్రభుత్వానికి 2019 వరకూ సమయం ఉందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కర్యాకారి మదల్ సమావేశం తొలిరోజు కార్యక్రమంలో భాగంగా హాజరైన దత్తాత్రేయ మీడియాతో్ మాట్లాడారు.

 

'రామ మందిరం అనేది దేశ ఎజెండా. అది యావత్తు జాతి కోరిక.  ఇందులో భాగంగానే వీహెచ్ పీకి మేము మద్దతు తెలుపుతున్నాం'అని తెలిపారు. ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణంపై బీజేపీ తీసుకున్ననిర్ణయంతోనే కేంద్రంలో పూర్తి ఆధిక్యంతో పగ్గాలు చేపట్టందన్నారు. అయితే అదే డిమాండ్ ను తాము మళ్లీ ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

మరిన్ని వార్తలు