మొబైల్‌ ఉత్పత్తి దారులకు శుభవార్త!

14 Apr, 2017 19:29 IST|Sakshi
మొబైల్‌ ఉత్పత్తి దారులకు శుభవార్త!

న్యూఢిల్లీ: మొబైల్‌ ఉత్పత్తిదారులకు ప్రభుత‍్వం త్వరలోనే భారీ ఊరటనివ్వనుంది. మొబైల్‌ విడిభాగాల దిగుమతులపై బ్యాంకు గ్యారంటీని ఉపసంహరించే వైపుగా ఆలోచిస్తోందట. ఈ మేరకు  బ్యాంకు హామీ నిబంధనలను సరళతరం   చేయనుందని  అధికారిక వర్గాల సమాచారం. స్థానికంగా ఉత్పత్తిని ప్రోత్స హించే దిశగా ఈ చర్యలు తీసుకోనుంది. తద్వారా మొబైల్ హ్యాండ్సెట్ మేకర్స్ కొంత ఉపశమనం పొందనున్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం   ఆధ్వర్యంలో  ఈ అంశంపై గత వారం ఉమ్మడి సమావేశం   నిర్వహించారు.  తమ పెట్టుబడులు మొత్తం బ్యాంక్‌ గ్యారంటీ కింద చిక్కుకుపోవడంపై మొబైల్‌ ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం  చేశారు.  అయితే ఈ వ్యవహారాన్ని ఐజీసీఆర్‌ (ఇంపోర్ట్‌ ఆఫ్‌ గూడ్స్‌ ఎట్‌ కాన్‌సెషనల్‌ రేట్‌) దృష్టికి వెడతామని హామీ పీఎంఏ వర్గాలు హామీ ఇచ్చాయి.  కనీసం మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న కంపెనీలకు ఈ హామీలను ఎత్తివేయాల్సిందిగా సూచిస్తామని తెలిపాయి. దేశంలో మొబైల్‌ పరిశ్రమ  ఎదుర్కొంటున్న ఆటంకాలపై పిరిశ్రమ పెద్దలు,  అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిది పీటీఐకి వివరించారు. 

ఈ వార్తలపై సెల్యులర్‌ అసోసియేషన్‌  జాతీయ అధ్యక్షుడు పంకజ్‌ మంహాంద్రో సంప్రదించగా పీఏంఓ కార్యాలయంపై మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ అధికారులకు,  పరిశ్రమ ప్రతినిధులకు మధ్య సమన‍్వయంగా ఎలక్ట్రానిక్స్,  ఐటిమంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలోని టాస్క్‌ ఫోర్స్‌ 2019 నాటికి దేశంలో 500మిలియన్ల  మొబైల్‌ ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 40శాతం విజయం సాధించిందని పంకజ్‌ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మొబైల్‌ ఉత్పత్తిదారుల ఆదాయరక్షణతోపాటు, పరిశ్రమకు  మార్గం మరింత సుగమవుతుందని వ్యాఖ్యానించారు.
కాగా   కంపెనీలు చెల్లిస్తున్న బ్యాంకు గ్యారంటీ నిధులు రూ. 29వేల కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు