నేతన్నకు ఆరోగ్య బీమా!

3 Apr, 2017 03:54 IST|Sakshi
నేతన్నకు ఆరోగ్య బీమా!

న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)  పథకం కింద నేత కార్మికులకు(హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్‌) ఆరోగ్య బీమా పథకంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 8 కోట్ల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐసీ కింద మేలు జరగనుందని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. నేత కార్మికులకు ఈఎస్‌ఐ పథకం కిందకు చేర్చాలన్న కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ రాసిన లేఖపై మంత్రి స్పందించారు.

మరిన్ని వార్తలు