హజ్ యాత్రకు మెరుగైన సదుపాయాలు: సుష్మా

24 Jun, 2014 00:36 IST|Sakshi

న్యూఢిల్లీ: హజ్ యాత్రికుల సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. హజ్ వార్షిక యాత్రకు భారత్ కోటాలో విధించిన 20శాతం కోతను ఉపసంహరించుకునేలా సౌదీ అరేబియాను కోరతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.  హాజ్ యాత్రికుల ప్రయాణ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. హజ్ యాత్రపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిల భారత సదస్సులో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. హజ్ యాత్రికులనుంచి టికె ట్ చార్జీ వసూలులో ఎయిరిండియా తీరును ఆమె తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఎంపిక చేసిన ఇతర విమానాశ్రయాలనుంచి హజ్‌యాత్రకు టికెట్‌కు రూ. 62,800 వసూలు చేస్తున్నారని, శ్రీనగర్‌నుంచి హజ్ యాత్రకు మాత్రం రూ. 1.54లక్షలు వసూలు చేస్తున్నారని ఇది కాశ్మీర్ ప్రజలకు భారం కాగలదని అన్నారు. కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు.


 

>
మరిన్ని వార్తలు