ప్రింట్, నిర్మాణం, రిటైల్ రంగంలో మరిన్నిఎఫ్‌డీఐలు

17 May, 2017 20:08 IST|Sakshi
ప్రింట్, నిర్మాణం, రిటైల్ రంగంలో మరిన్ని ఎఫ్‌డీఐలు

న్యూడిల్లీ: ప్రింట్ మీడియా, నిర్మాణం, రిటైల్ రంగాల్లో  మరిన్ని విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అంశంపై  బుధవారం ఆర్థిక మంత్రిత్వశాఖలో  వివరణాత్మక చర్చలు జరిగాయి. ఈ ప్రతిపాదనలపై తుది ఆమోదం పొందేందుకు కేంద్ర, వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర కేబినెట్‌ను సంప్రదించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డీఐ నిబంధనలను మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం  యోచిస్తోందని   విశ్వసనీయ వర్గాల సమాచారం.   ఆర్ధిక వృద్ధికి  ఉద్యోగాలను సృష్టించేందుకు పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణంలో మరిన్ని ఎఫ్డిఐలను ఆకర్షించనుందని తెలిపాయి.  2017-18 సంవత్సర ఆర్థిక బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మేరకు ఈ కసరత్తు చేస్తోంది. విదేశీ పెట్టుబడులు కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం  ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులపై దృష్టిపెట్టింది.

 సింగిల్ బ్రాండు,  బహుళ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్లో పాలసీని సులభతరం చేస్తుంది. ఒకే బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం ఎఫ్డిఐని కొన్ని పరిస్థితులతో ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించాలనే  అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.  ప్రస్తుతం, 49 శాతం వరకు ఆటోమాటిక్ మార్గంలో అనుమతి ఉంది కానీ ఆ పరిమితి దాటితే ప్రభుత్వం  ఆమోదం అవసరం. అంతేకాదు, విదేశీ కంపెనీలకు 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను అమ్మడం కోసం దుకాణాలు తెరిచేందుకు  అనుమతినివ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కొన్ని నిబంధనలు,  పరిమితులతో, వార్తాపత్రికలు,  శాస్త్రీయ మ్యాగజైన్ల  ప్రచురణ  లాంటి  విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం అనుమతిస్తోంది.  అలాగే  వివిధ  కండిషన్లతో  నిర్మాణ రంగ ప్రాజెక్టులలో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది.  ఈ విధానాన్ని కూడా మరింత   సరళతరం చేసే ప్రతిపాదన సిద్ధం చేసింది. పూర్తికాని ప్లాట్లు,  ఇతర ప్రాజెక్టులలో కూడా  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక భారతీయకంపెనీ   అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది.  ఇండియన్ ఇన్వస్టీ కంపెనీకి అభివృద్ధి చెందిన ప్లాట్లను విక్రయించటానికి అనుమతి ఉంది. రహదారులు, నీటి సరఫరా, వీధి దీపాలు, నీటి పారుదల ,  మురికినీరు తదితర మౌలిక సదుపాయాలు ఉన్న ప్లాట్ల  విక్రయానికి మాత్రమే అనుమతి.

కాగా  విదేశీ పెట్టుబడులు దేశం చెల్లింపుల సమతుల్యతను మెరుగుపర్చడంతో పాటు,  ఇతర ప్రపంచ కరెన్సీలకు, ప్రత్యేకంగా అమెరికా డాలర్‌ వ్యతిరేకంగా రూపాయి విలువను మరింత బలోపేతం చేస్తుందనేది అంచనా. ఈ నేపథ్యంలోనే  గత ఏడాది  రక్షణ, పౌర విమానయాన, నిర్మాణం, అభివృద్ధి, ప్రైవేటు భద్రతా సంస్థలు, రియల్ ఎస్టేట్, న్యూస్ ప్రసారాలు సహా  దాదాపు 12 సెక్టార్లలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది.

 

మరిన్ని వార్తలు