-

'గ్రావిటీ'కి ఆస్కార్ అవార్డుల పంట

3 Mar, 2014 10:38 IST|Sakshi
'గ్రావిటీ'కి ఆస్కార్ అవార్డుల పంట

లాస్ ఏంజిల్స్ :  ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ  వైభవంగా కొనసాగుతోంది.  లాస్ ఏంజెలెస్‌లోని కొడాక్ థియేటర్‌లో 86వ ఆస్కార్ అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఈసారి 'గ్రావిటీ' అవార్డుల పంట పండింది. జార్జ్‌ క్లూనీ, శాండ్రా బుల్లక్‌ కథానాయకులుగా నటించిన ‘గ్రావిటి’ చిత్రం ఏకంగా అయిదు అవార్డులను సొంతం చేసుకుని దూసుకు పోతోంది. మరో రెండు విభాగాల్లోనూ పోటీ పడుతోంది.

ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు పొందిన వ్యక్తులు..చిత్రాలు..
ఉత్తమ నటుడు- లియోనార్డో డికాప్రియో(బ్రూస్)
ఉత్తమ సహాయనటుడు- జారెడ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
ఉత్తమ సహాయనటి- లుపిటా యాంగో  (12 ఇయర్స్ ఎ స్లేవ్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం- ఫ్లోజెన్

అయిదు అవార్డులను సొంతం చేసుకున్న గ్రావిటీ
ఉత్తమ ఛాయాగ్రహణం చిత్రం : గ్రావిటీ
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : గ్లెన్ ఫ్రీ మాంట్లే (గ్రావిటీ)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : స్కిప్ లీవ్ సే, నివ్ ఆద్రి (గ్రావిటీ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : టిమ్ వెబ్బర్, క్రిస్ లారెన్స్ (గ్రావిటీ)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : (గ్రావిటీ)

ఉత్తమ కాస్టూమ్స్ డిజైన్ చిత్రం : ద గ్రేట్ గాట్స్ బీ
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : 20 ఫీట్ ఫ్రం స్టార్ డమ్
ఉత్తమ విదేశీ చిత్రం : ద గ్రేట్ బ్యూటి
ఉత్తమ మేకప్, కేశాలంకరణ చిత్రం : డల్లాస్ బయ్యర్స్ క్లబ్
ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రం : మిస్టర్ హుబ్లాట్
ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం : హీలియం

'గ్రావిటీ’ ఇదో విజువల్‌ వండర్
సంచలన చిత్రాలను రూపొందించిన వార్నర్ బ్రదర్స్ సంస్థచే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన  భారీ అంతరిక్ష సైన్స్ ఫిక్షన్ చిత్రం  ‘గ్రావిటీ' (Gravity).  జార్జ్ క్లోనీ, సాండా బుల్లోక్ వంటి ప్రముఖ స్టార్లు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం నేపధ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆల్‌ఫోన్సో కారోన్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం కోసం ఆల్ ఫోన్సో సుమారు నాలుగున్నర సంవత్సరాలు శ్రమించారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించి వినియోగించిన టెక్నాలజీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్గులను చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తలెత్తే పలు సమస్యలను ఇద్దరు  వ్యోమగామలు ఎలా అధిగమించగలిగారు అనే అంశాలను దర్శకుడు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అనుభూతులతో చూపించటం జరిగింది. ఈ 3డీ స్పేస్ థ్రిల్లర్ మీకు ఆకాశంలో ఉన్న అనుభూతులను చేరువ చేసింది.

మరిన్ని వార్తలు