ప్రారంభమైన జీవోఎం సమావేశం

4 Feb, 2014 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)మంగళశారం సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లులపై అసెంబ్లీ పంపిన అభిప్రాయాలు,సవరణలను జీవోఎం ఈ సందర్భంగా పరిశీలించనుంది. అసెంబ్లీలో కోరిన, ఇటు విపక్షాలు సూచించిన సవరణల్లో ప్రధానంగా పోలవరం, కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజివంటి అంశాలను తిరిగి బిల్లులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం చర్చించనుంది.

సవరణలు చేసి తుది బిల్లును జీవోఎం సిద్ధం చేయనుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తిరిగి కేబినెట్  బిల్లును రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది.  ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, ఆంటోనీ హాజరయ్యారు. కాగా సమావేశం జరిగే హోంశాఖ కార్యాలయానికి కేంద్రమంత్రి పురందేశ్వరి, కిల్లి కృపారాణి వచ్చారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు