విభజన బిల్లుకు తుది మెరుగులు!

6 Feb, 2014 10:24 IST|Sakshi
విభజన బిల్లుకు తుది మెరుగులు!

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జీవోఎంలోని కేంద్ర మంత్రులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. బుధవారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలపై జీవోఎంలోని కేంద్ర మంత్రులు ఈ సందర్బంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5.30 నిముషాలకు కేంద్ర క్యాబినేట్ భేటీ కానుంది.

 

అయితే ఆ సమయానికి విభజన బిల్లుకు తుది రూపం ఇచ్చేందుకు జీవోఎం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఆంధప్రదేశ్ విభజన జరిగితే పోలవరం డివిజన్ సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని తదితర మొత్తం 9 ప్రతిపాదనలు జీవోఎం వద్ద సీమాంధ్ర కేంద్ర మంత్రులు బుధవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరగనున్న కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఎదుట తెలంగాణ బిల్లు టేబుల్ ఐటంగా వచ్చే అవకాశం ఉంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు