జీఎస్‌టీ: కార్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?

19 May, 2017 20:13 IST|Sakshi
జీఎస్‌టీ: కార్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?

న్యూఢిల్లీ: జీఎస్‌టీ  పన్నుల  రేటుపై  ఆటోమొబైల్‌ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం  చేశారు.  జీఎస్‌టీ తాజా పన్ను రేటు 28శాతంగా నిర్ణయించడం  పరిశ్రమకు లబ్ది చేకూర్చనుందని  ఆటో మొబైల్‌ పరిశ్రమ పెద్దలు వ్యాఖ‍్యానించారు.  ఆటోమొబైల్‌ పరిశ్రమకు సంబంధించి జీఎస్‌టీ  రేట్లు  ఊహించిన రీతిలో  ఉన్నాయని  సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది.

 జీఎస్‌టీ 28శాతం గా నిర్ణయించినప్పటికీ   కమర్షియల్‌ వెహికల్స్‌ , టూవీలర్‌ ధరలు  దాదాపుగా తటస్థంగా ఉండవచ్చని పేర్కొన్నారు  అయితే పెద్ద సెడాన్లు, ఎస్‌యూవీ లాంటి లగ్జరీ వాహనాల రేట్లు దిగిరానున్నాయని  ఇక్రా పేర్కొంది.  జీఎస్‌టీ తరువాత చిన్నకార్ల ధరలు స్వల్పంగా పెరిగొచ్చని  ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్రతా రాయ్‌ చెప్పారు. ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జిఎస్టిని ప్రకటించినప్పటికీ వైవిధ్యభరితమైన కార్లపై వేర్వేరు పన్నుల స్లాబ్లులపై ఇంకా స్పష్టత లేదని  రీసెర్చ్ హెడ్  వైభవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. . అయితే త్రీ వీలర్‌ ధరలు పెరగనున్నాయని చెప్పారు.  చిన‍్నకార్ల ధరలు 2-3 శాతం పెరుగుతాయనీ,  లగ్జరీ కార్ల ధరలు దిగి  వచ్చే అవకాశం ఉందన్నారు.

కాగా  జీఎస్‌టీ కౌన్సిల్ 14 వ సమావేశంలో ఆటోమొబైల్స్తో సహా అన్ని వర్గాల వస్తువులపై  జీఎస్‌టీ రేటును ఖరారు చేసింది.  ముఖ్యంగా ఆటోమొబైల్ విభాగానికి ఆధార జీఎస్‌టీ ఆధార రేటు 28శాతంగా నిర్ణయించింది.   బేస్ రేటుతో పాటుగా, పెట్రోలు మరియు డీజిల్ ఇంజిన్లతో కూడిన చిన్న కార్లపై 1శాతం, 3శాతం సెస్‌ను  ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న మొత్తం పరోక్ష పన్ను రేట్లకు దాదాపు అనుగుణంగానే ఉంది.

 

మరిన్ని వార్తలు