సీబీఐసీ గా మారనున్న సీబీఈసీ

25 Mar, 2017 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల అత్యున్నత విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ పేరు మారనుంది.జులై 1 నుంచి జీఎస్‌టీ  చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో   త్వరలోనే సంస్థ పేరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్‌ గా మారనుంది. శాసన ఆమోదం పొందిన తర్వాత సీబీఐసీగా అవతరించనుందనీ, ఇది జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించే నిబంధనలు, మినహాయింపులను  అమలు చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

21మండలాలు, 15 ఉప కమిషనరేట్ల, 768 డివిజన్లు, 3,969 పరిధులు, 49 ఆడిట్ కమిషనరేట్ల, 50 అప్పీల్స్ కమిషనరేట్లతో  కూడిన 101 జిఎస్టి పన్ను చెల్లింపుదారు సర్వీసుల కమిషనరేట్లను సీబీఐసీ కలిగి ఉంటుందని తెలిపింది. దేశంలో పరోక్ష పన్ను పరిపాలన నిర్మాణం ద్వారా అన్ని పన్ను పన్నుచెల్లింపుదారుల సేవల రెండరింగ్ నిర్థారిస్తుందని తెలిపింది.  ఒక బలమైన  ఐటీ నెట్వర్క్ తో,   సీబీఐసీ క్రింద సిస్టమ్స్ డైరెక్టరేట్ జనరల్  విధానాలు బలోపేతం కానున్నాయని పేర్కొంది. అలాగే ఇప్పటికే  ఉనికిలో ఉన్న శిక్షణ  సంస్థ  నేషనల్ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్   మారుతుందని, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్  దేశ వ్యాప్తంగా ఉంటుందనీ,  ఇది  కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరోక్ష పన్ను విభాగానికి చెందిన ఉద్యోగులు, ట్రేడ్ ఇండస్ట్రీ సభ్యులు  సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని  చెప్పింది.   సీబీఐటీ  సభ్యులు  కస్టమ్స్, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, న్యాయ పరమైన అంశాలు, శిక్షణ, వివాదాల వంటివి పర్యవేక్షిస్తారు.

కాగా ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్ లాంటి పలు రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో అమలులోకి తీసుకొస్తున్న జిఎస్‌టి కేవలం ఒకే విధమైన పన్ను రేటు మాత్రమే కాదని, సింగిల్ పాయింట్ పన్ను వ్యవస్థగా కూడా ఉంటుందని ఆర్థిక శాఖచెబుతున్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు