ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ గంటలు పనిచేస్తారు?

5 Aug, 2016 18:59 IST|Sakshi

న్యూయార్క్: ప్రపంచంలో మిలీనియన్లు (2000 సంవత్సరం నాటికి యుక్త వయసు వచ్చిన వారు) బద్ధకస్తులని, వారిలో ఉత్పాదక శక్తి  సన్నగిల్లుతుందని వ్యాపారవర్గాలు భావిస్తుంటాయి. కానీ ఆసియా దేశాల్లో మాత్రం మిలీనియన్లు కొద్దీ యువకులు ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. వారిలో భారతీయులు అగ్రభాగాన నిలవడం విశేషం. వారానికి 40 గంటలు పనిచేయాలంటే ప్రపంచంలో మిలీనియన్లు అపసోపాలు పడుతుంటారని ఇప్పటి వరకు వ్యాపారవర్గాల్లో నెలకొన్న భావన.

కానీ వారిలో మూడొంతుల మంది వారానికి 40 గంటకుపైగానే పనిచేస్తున్నారని, కొన్ని దేశాల్లో వారానికి 50 గంటలు పనిచేస్తున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. భారత్‌లో 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్యనున్న యువకులు వారానికి 52 గంటలు పనిచేస్తున్నారు. చైనా, మెక్సికో, సింగపూర్ దేశాల్లో వారానికి 48 గంటలు పనిచేస్తున్నారు. జపాన్, అమెరికా దేశాల్లో మిలీనియన్లు వారానికి 45 గంటలు పనిచేస్తుండగా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో వారానికి సగటున 41 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు