'ఆస్తుల వివరాలు ఇవ్వడం కుదరదు'

12 Aug, 2014 10:27 IST|Sakshi
గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్(ఫైల్)

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివరాలు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. సీఎం, మంత్రుల ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరుతూ ముంబైకి చెందిన అనిల్ గాల్గానీ.. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గత ఐదేళ్లలో సీఎం, మంత్రుల ఆస్తులు వివరాల కావాలని అందులో కోరారు. ఆస్తుల వివరాలు సమర్పించని వారిపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

అయితే అనిల్ గాల్గానీ అడిగిన వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోవడం పట్ల సమాచార హక్కు మాజీ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం మూర్కత్వంలో వ్యవహరించిందని విమర్శించారు.

మరిన్ని వార్తలు