వీసా ఆందోళనలు : రంగంలోకి మంత్రి

6 Feb, 2017 20:12 IST|Sakshi
వీసా ఆందోళనలు : రంగంలోకి మంత్రి
న్యూఢిల్లీ :
హెచ్-1బీ వీసాపై రేకెత్తిన ఆందోళనల నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగనున్నారు. అమెరికా వీసా విధానంపై టెక్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్తో త్వరలోనే మంత్రి భేటీ కానున్నట్టు సోమవారం తెలిపారు.  అమెరికా ఇటీవల హెచ్-1బీ వీసాలో సవరణలు చేపట్టడానికి తీసుకొచ్చిన బిల్లు ఇండియన్ ఐటీ ఇండస్ట్రిపై ప్రభావం చూపనుందని తెలిపారు. మన టెకీస్ అక్కడ పనిచేస్తున్నారన్నారు.  ఈ విషయంపై అమెరికా అథారిటీలపై నిరంతరం టచ్లో ఉంటున్నామని మంత్రి చెప్పారు.
 
''హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించడం కచ్చితంగా భారత్పై ప్రభావం చూపనుంది. ఈ విషయంపై పార్లమెంటరీ సమావేశాలనంతరం నాస్కామ్తో చర్చిస్తాం. అమెరికాలో ఎక్కువగా పేరులోకి వచ్చిన దేశీయ కంపెనీలు, ఆ వాతారణంలో ఎలా పనిచేస్తున్నాయనే దానిపై వారితో సంప్రదింపులు జరుపుతాం. ఎలాంటి వ్యూహాలను వారు అమలుచేస్తున్నారో కూడా తెలుసుకుంటాం'' అని చెప్పారు.  నాస్కామ్ ప్రత్యేక బృందం సైతం ఈ నెల 22-24 మధ్యలో అమెరికాకు వెళ్లనుంది.
 
కొత్తగా ఏర్పడిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ వర్గాలతో, సెనేటర్లతో సమావేశం కానుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన అనంతరం దేశీయ ఐటీ కంపెనీల్లో ఆందోళనలు రేపుతూ హెచ్-1బీ వీసా విధానంలో మార్పులను ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రకారం హెచ్-1బీ వీసా హోల్డర్స్కు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రెట్టింపు కానుంది. విదేశీ ఉద్యోగులకు వీసా జారీలు కఠినతరం కానున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీలపై నిర్వహణ వ్యయాల భారం భారీగా పడనుంది.
 
మరిన్ని వార్తలు