హెచ్‌-1బీ వీసా కోటా ముగిసింది

8 Apr, 2017 11:40 IST|Sakshi
హెచ్‌-1బీ వీసా కోటా ముగిసింది

వాషింగ్టన్‌:  విదేశీ ఐటి నిపుణులకు  అమెరికా మంజూరు చేసే హెచ్‌-1బీ వీసా  మాండేటరీ కోటా ముగిసింది. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌-1బీ వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్  ముగిసిందని ఫెడరల్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. దీనికి సంబంధించిన మాండేటరీ కోటా 65 వేలకు  చేరిందని తెలిపింది. 2018ఆర్థిక సంవత్సరానికి గాను   65వేల తప్పనిసరి కోటా రీచ్‌ అయినట్టు   అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం  (యూఎస్‌సీఐఎస్‌) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే  మాస్టర్‌ క్యాప్‌గా పిలిచే  అడ్వాన్స్డ్‌ డిగ్రీ మినహాయింపు కోటా కింద 20వేల అభ్యర్థుల ఎంపిక కూడా ముగిసిందని  పేర్కొంది.   

అమెరికన్‌ కంపెనీలు విదేశీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ నిపుణులను తమ దేశానికి రప్పించుకుని తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు హెచ్‌-1బీ వీసా మంజూరు చేస్తాయి. అయితే,  65 వేలకు మించకుండా ఈ వీసాలను జారీ చేస్తుంది.  దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభించింది.

అయితే,  గత సంవత్సరాల వలే కాకుండా ఈ ప్రక్రియను ఎలా  చేపట్టింది అనేది స్పష్టం చేయలేదు. ఇప్పటివరకు ఉన్న కంప్యూటర్‌ ద్వారా  లాటరీ ద్వారా వీసాలను జారీ  చేసే పద్ధతికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.
 
 

మరిన్ని వార్తలు