రవి రుయా అభ్యర్థనను కొట్టేసిన సుప్రీం

6 Sep, 2016 13:49 IST|Sakshi
రవి రుయా అభ్యర్థనను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్సార్ గ్రూపు ప్రమోటర్ రవి రుయా విదేశీ పర్యటన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు కూడా ఓ వ్యక్తి తమ లాగే చెప్పి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చేదు అనుభవంతో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంది. 2002లోని 2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో రవి రుయా భాగమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొటున్నారు. కెనడా, యూఎస్, సౌదీ అరేబియాలోని బిజినెస్ పనులపై ఆయన విదేశీ పర్యటన వెళ్లాల్సి ఉందని రవిరుయా తరుఫున లాయర్లు కోర్టుకు విన్నపించుకున్నారు. రవి బెయిల్ కండీషన్లను ఉల్లంఘించరని లాయర్లు వాదించారు. కానీ ఈ విషయాలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. 
 
ఒకవేళ రవిరుయాను విదేశీ పర్యటనకు అనుమతించాక, అతను అక్కడి నుంచి తిరిగి రాకపోతే ఎలా అని ప్రశ్నలు సంధించింది. ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ కావడంతో  రవి రుయాను తిరిగి భారత్కు తీసుకురావడం కష్టతరమవుతుందని సీబీఐ పేర్కొంది. సీబీఐ వాదనను కోర్టు అంగీకరించింది. ముందుకూడా ఇలానే జరిగిందని, ఓ వ్యక్తి ఇలానే వాగ్దానం చేసి నిలబెట్టుకోలేకపోయాయడని, ఆ చేదు అనుభవంతో విదేశీ పర్యటన అనుమతిని తిరస్కరిస్తున్నట్టు సుప్రీం పేర్కొంది. ఈ కేసులో రుయా ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. రష్యా, యూకే, ఫ్రాన్స్కు వెళ్లడానికి గతేడాది ఆయనకు అనుమతించిన కోర్టు, ఈ ఏడాది తిరస్కరించింది. 
మరిన్ని వార్తలు