కేటీఆర్‌పై సమంత ప్రశంసల జల్లు!

24 Jul, 2017 20:00 IST|Sakshi
కేటీఆర్‌పై సమంత ప్రశంసల జల్లు!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా సినీనటి సమంత ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికమంది అభిమానించి నాయకుడు కేటీఆర్‌ అని, ఆయన నిజమైన స్ఫూర్తి అని సమంత కొనియాడారు. భావి ఆశకిరణమైన ఆయన గురించి తెలియడం గౌరవంగా భావిస్తున్నట్టు సమంత పేర్కొన్నారు. సమంత ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌.. మా చేనేత ప్రచాకకర్తకు ధన్యవాదాలు అంటు బదులిచ్చారు. ఆమె చూపిన శ్రద్ధ, అంకితభావం చేనేతకు కొత్త జీవాన్ని అందించాయని ప్రశంసించారు. వోవెన్‌2017 కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా, ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు అనేకమంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, లావణ్య త్రిపాఠి, దేవీ శ్రీప్రసాద్‌, అక్కినేని అఖిల్‌, మంచు విష్ణు, వెన్నెల కిషోర్‌, సానియా మీర్జా, పీవీ సింధుతోపాటు మంత్రి హరీశ్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రి లోకేశ్‌ తదితరులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు