హర్యానా ముఖ్యమంత్రి హుడాకు చెంపదెబ్బ

3 Feb, 2014 07:57 IST|Sakshi

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు అనూహ్య, చేదు అనుభవం ఎదురైంది. జెడ్ కేటగిరి భద్రత.. చుట్టూ సాయుధ బలగాలు.. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతమంది ఉన్నా ఓ యువకుడు హుడాపై దాడి చేసి చెంప దెబ్బ కొట్టాడు. రాష్ట్ర పారిశ్రామిక నగరం పానిపట్లో ఆదివారం హుడా ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

పానిపట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ జీపులో ముందు బాగాన నిల్చున్న హుడా  ర్యాలీ వేదిక వద్దకు బయల్దేరుతుండగా దాడి జరిగింది. హర్యానా పోలీసులు వెంటనే హుడా చుట్టూ రక్షణగా నిలిచి అగంతకుడిని దూరంగా లాక్కెల్లారు. కోపోద్రిక్తుడైన ముఖ్యమంత్రి అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. కాగా దాడిని చేసిన వ్యక్తి ఎవరన్నది గుర్తించాల్సివుంది. భారీ భద్రత వలయాన్ని దాటుకుని అగంతకుడు ముఖ్యమంత్రి దాడికి పాల్పడటం భద్రత చర్యల్లోని లోపాల్ని బయటపెట్టాయి.

మరిన్ని వార్తలు