అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం: కర్ణాటక రవాణా మంత్రి

14 Nov, 2013 10:23 IST|Sakshi

కర్ణాటకలోని హవేరి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున నేషనల్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి గురువారం బెంగళూరులో వెల్లడించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సు 140 -150  కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు.హవేరి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదం,ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం వద్ద వోల్వో బస్సు అగ్ని ప్రమాదం ఘటనలు ఒకేలా ఉన్నాయని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరు ముంబైకి చెందిన శ్రీరాంగా గుర్తించినట్లు ఆయన  పేర్కొన్నారు. గత సంవత్సరమే ప్రమాదం జరిగిన బస్సును కొనుగోలు చేశారని మంత్రి రామలింగారెడ్డి వివరించారు.
 

 

అయితే ప్రమాదానికి ముందు పెధ్ద శబ్దం వచ్చి, మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అద్దాలు పగుల కొట్టి బయటకు దూకామని ఆ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు వెళ్లడించారు. అయితే తన పాస్పోర్ట్, డాక్యుమెంట్స్ కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెట్స్కు చెందిన వోల్వో బస్సు ఈ రోజు తెల్లవారుజామున కునుమళ్లహళ్లి వద్ద వర్దా నది సమీపంలోనిరోడ్డు డివైడర్ను ఢీకొంది. అనంతరం టైర్ పేలింది. దాంతో ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ బస్సు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రలును హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు