కేజ్రీవాల్ కు హైకోర్టు నోటీసు

22 Dec, 2015 16:16 IST|Sakshi
కేజ్రీవాల్ కు హైకోర్టు నోటీసు

న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వివాదంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసు జారీచేసింది. కేజ్రీవాల్ తో పాటు ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, సింజయ్ సింగ్, అశుతోష్, రాఘవ చద్దా, దీపక్ వాజపేయిలకు నోటీసులిచ్చింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులిచ్చింది. మూడు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

డీడీసీఏ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తనపై ఆరోపణలు చేయడంతో కేజ్రీవాల్, ఆప్ నేతలపై రూ. పది కోట్లకు పాటియాలా హౌస్ కోర్టులో అరుణ్ జైట్లీ సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలను వేశారు. వారం క్రితం కేజ్రీవాల్ ఆఫీసులో ఆయన ముఖ్య కార్యదర్శిపై సీబీఐ దాడులు చేయడంతో వివాదం చెలరేగింది. డీడీసీఏకి జైట్లీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ సీఎంవోలో సోదాలు జరిపిందని ఆప్ నేతలు ఆరోపించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు