హెచ్సీఎల్ ఫలితాలు భేష్... అమెరికా కంపెనీ కొనుగోలు

21 Oct, 2016 10:58 IST|Sakshi
హెచ్సీఎల్ ఫలితాలు భేష్... అమెరికా కంపెనీ కొనుగోలు

ముంబై: దేశంలో నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల  సంస్థ  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  శుక్రవారం మెరుగైన ఆర్థిక ఫలితాలను  ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో  ముగిసిన  క్యూ2లో ఉత్సాహకరమైన ఫలితాలను ప్రకటించి ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. 17 శాతం వృద్ధితో  రూ.  2,016 కోట్ల నికర  లాభాలను నమోదు చేసింది.  మొత్తం ఆదాయం కూడా 14 శాతంపైగా పుంజుకుని రూ. 11,519 కోట్లను  సాధించింది. డాలర్ రెవెన్యూ కూడా 2 శాతం జంప్ చేసి 1722మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.క్యూ2లో నిర్వహణ లాభం(ఇబిటా)  రూ. 2318 కోట్లు, ఇబిటా మార్జిన్లు 20.1 శాతంగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ టెక్‌  షేరు 4 శాతం  లాభాలతో ట్రేడవుతోంది.  

మరోవైపు2016-17ఆర్థిక సంవత్సరానికి గాను 12-14 శాతం ఆదాయ వృద్ధి అంచనా(గెడెన్స్‌)లను యథాతథంగా ఉంచింది. అమెరికాకు చెందిన బట్లర్‌ అమెరికా ఏరోస్పేస్‌ సంస్థను కొనుగోలు చేసినట్లు  హెచ్‌సీఎల్‌ టెక్ వెల్లడించింది. అమెరికా ఏరోస్పేస్, డిఫెన్స్  కస్టమర్లకు ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ స్వాధీనానికి  8.5 కోట్ల డాలర్లను  చెల్లించనున్ననట్టు తెలిపింది.  నగదు రూపంలో 85 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది డిశెంబర్ నాటికి అమెరికా సహా దేశం రెగ్యులేటరీ అనుమతులు పూర్తి కానున్నట్టు పేర్కొంది.

ప్రస్తుతం సీవోవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌కు  పదోన్నతి కల్పించినట్టు  బీఎస్ఈ  ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. అతణ్ని సీఈవోగా నియమించినట్టు, అక్టోబర్ 20నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు  ప్రకటించింది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు