పబ్పై కుప్పకూలిన హెలికాఫ్టర్

30 Nov, 2013 09:20 IST|Sakshi

స్కాట్లాండ్లో అతిపెద్ద నగరమైన గ్లాస్గోలోని ఓ పబ్పై హెలికాఫ్టర్ గత రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో పబ్లో హుషార్గా కేరింతలు కొడుతున్న వారిలో అత్యధికులు గాయపడ్డారు. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

ఈ మేరకు స్కాట్లాండ్లో స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. కుప్పకూలిన హెలికాఫ్టర్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులదని భావిస్తున్నట్లు చెప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్ అత్యంత వేగంతో అకాశంలో పయనిస్తుందని తెలిపింది. అయితే ఆ ఘటనలో మృతులు కూడా ఉండవచ్చని అలాగే  క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో పబ్ పాక్షికంగా దెబ్బతిందని వివరించింది. ఆ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా