13 వ తేదీ వరకూ ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకండి!

30 Sep, 2014 16:59 IST|Sakshi
13 వ తేదీ వరకూ ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకండి!

కటక్: ఒడిశా రాష్ట్ర బీజేడీ(బిజూ జనతాదళ్) ఎమ్మెల్యేకు హైకోర్టులో ఉపశమనం లభించింది. పొంజీ స్కీం స్కాంకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నబీజేడీ ఎమ్మెల్యే ప్రవాత్ త్రిపాఠీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టింది. అంతే కాకుండా అక్టోబర్ 13 వ తేదీ వరకూ అతన్ని అదుపులోకి తీసుకోవద్దని కోర్టు సీబీఐకి సూచించింది. పొంజీ స్కీం స్కాం కేసులో ఎమ్మెల్యే త్రిపాఠీని సీబీఐ విచారించడంతో ఆయన ఈ పిటీషన్ దాఖలు చేశారు.

 

గత నెల్లో త్రిపాఠీ ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు అతన్ని ప్రశ్నించారు. దీంతో త్రిపాఠీ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ తనను ఇబ్బందే పెట్టేందుకు యత్నిస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. దీన్ని సోమవారం విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. అతని దరఖాస్తును పెండింగ్ లో పెట్టింది. ఈ నెల 13 వ తేదీ వరకూ సీబీఐ ఎటువంటి అరెస్టు చేయకూడదంటూ జడ్జి డి. దాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 15 వ తేదీన కాందామాల్ లోక్ సభ సీటుకు ఎన్నిక జరుగనుంది.

మరిన్ని వార్తలు