రెండు ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్

29 Sep, 2015 12:38 IST|Sakshi
రెండు ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: రైతులకు ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

రైతు ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించకుండా, పరిహారం ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి కారణాలు అన్వేషిస్తారని.. దేశానికి వెన్నుముఖ అయిన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడింది.

రైతు ఆత్మహత్యలపై జనవిజ్ఞాన వేదిక దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు