'కశ్మీర్ ను సైనికుల స్మశానంగా మారుస్తాం'

4 Sep, 2016 14:34 IST|Sakshi

హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను భారతీయ సైనికుల స్మశానంగా మారుస్తామని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీట్ కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఓ ఇంగ్లీషు చానెల్ కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చిన సలాహుద్దీన్.. కశ్మీర్ పై చర్చలు వ్యర్ధమని అన్నారు. కేవలం మిలిటెన్సీ మాత్రమే కశ్మీర్ సమస్యకు సమాధానం ఇస్తుందని చెప్పారు.

కశ్మీరీ లీడర్ షిప్, ప్రజలు, ముజాహిద్దీన్ లు కశ్మీర్ సమస్యకు శాంతియుత మార్గం లేదని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ కేవలం వ్యాలీలో శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికేనని చెప్పారు. కశ్మీర్ వ్యాలీని మిలిటెంట్ల చేతుల్లోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. జులై 8న బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత మిలిటెన్సీ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందని తెలిపారు. ఆర్మీని పెద్ద ఎత్తున మోహరించడం వల్ల మిలిటెన్సీ ఉద్యమం మరింత బలపడుతుందని అన్నారు. కశ్మీర్ సమస్యను ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం కూడా తాను తుపాకీ పట్టడానికి ఒక కారణమని చెప్పారు.

మరిన్ని వార్తలు