డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ కైన్

23 Jul, 2016 07:46 IST|Sakshi
డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ కైన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా వర్జీనియా సెనేటర్ టిమ్ కైన్ పేరును అధ్యక్ష అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ప్రతిపాదించారు. చాలాకాలంగా హిల్లరీకి కైన్ నమ్మిన అనుచరుడు. నవంబర్ నెలలో జరిగే ఎన్నికల్లో ట్రంప్ను ఓడించడానికి కైన్ ఉపయోగపడతారని హిల్లరీ భావిస్తున్నట్లు సమాచారం. ఆమె సలహాదారులు కొన్ని నెలల పాటు గాలించి, ఉపాధ్యక్ష పదవికి ఎవరైతే బాగా సరిపోతారో వెతికి మరీ కైన్ పేరును సూచించారు.

గతంలో వర్జీనియా రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసిన కైన్ (58) స్పానిష్ భాషను అనర్గళంగా మాట్లాడతారు. ఆయన సెనేట్‌ విదేశీ సంబంధాల కమిటీలో సభ్యుడు. వాస్తవానికి కైన్ కంటే ముందు మరికొన్ని పేర్లను కూడా హిల్లరీ క్లింటన్ పరిశీలించారు. అయితే చివరకు ఈయన వైపే మొగ్గుచూపారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఆయన ఎన్నికల్లో ఓడిపోలేదని హిల్లరీ చెప్పారు. వచ్చేవారం ఫిలడెల్ఫియాలో జరిగే పార్టీ సమావేశంలో ఆమెతో పాటు కైన్ కూడా పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు