ఒక రోజు సర్పంచ్!

13 Aug, 2016 14:13 IST|Sakshi

చండీగఢ్: హిసార్ జిల్లాలోని ఓ గ్రామం స్కూల్ టాపర్ ను ఒకరోజు గ్రామ సర్పంచ్ గా పనిచేసేందుకు నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఏడోతరగతిలో టాపర్ గా నిలిచిన బాలిక గ్రామపెద్దగా అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. నిబంధనలు ఇందుకు అంగీకరించకపోయినా గ్రామీణ మహిళా సాధికారత అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ధన్సూ గ్రామ సర్పంచ్ మనోహర్ లాల్ భాఖర్ తెలిపారు.


శనివారం ఒక రోజు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించబోయే అమ్మాయిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఏడో తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నట్లు వివరించారు. సుశీల ఖటర్ అనే బాలికకు 81 శాతం మార్కులు రాగా, ఆర్తి అనే మరో బాలికకు 87.5 శాతం మార్కులు వచ్చాయి. ఒక రోజు సర్పంచ్ గా ఎంపికైతే గ్రామ పాఠశాలకు ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించాలని అధికారికంగా లేఖ రాస్తానని సుశీల తెలిపింది.

మరిన్ని వార్తలు