హెచ్‌ఐవీ నివారణ కోసం వినూత్న ప్రాజెక్టు

11 Nov, 2015 11:27 IST|Sakshi
హెచ్‌ఐవీ నివారణ కోసం వినూత్న ప్రాజెక్టు

కోల్‌కతా: ఆసియాలో వేశ్యావాటికలకు పేరెన్నిక గల కోల్‌కతాలోని సోనాగచి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఎంపికైంది. హెచ్‌ఐవీ నిరోధక ఔషధాన్ని ఇక్కడి సెక్స్ వర్కర్లు ఇవ్వనున్నారు. డిసెంబర్‌లో మొదలయ్యే ప్రాజెక్టుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయి.

హెచ్‌ఐవీ సోకిన వ్యక్తితో సంభోగం జరిపిన హెచ్‌ఐవీ లేని సెక్స్‌వర్కర్లకు హెచ్‌ఐవీ నివారక ఔషధాన్ని అందజేస్తారు. ప్రాజెక్టుకు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు