స్క్రీన్ రీప్లేస్ మెంట్ వారెంటీతో ఆనర్ 5సీ

22 Jun, 2016 13:41 IST|Sakshi
స్క్రీన్ రీప్లేస్ మెంట్ వారెంటీతో ఆనర్ 5సీ

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువాయ్ టెర్మినల్ ఆనర్ బ్రాండ్ నుంచి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కట్లోకి విడుదల చేసింది. ఆనర్ 5సీ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర రూ.10,999. జూన్ 30 నుంచి ఫ్లిప్ కార్ట్, హైఆనర్.కామ్ లో ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి.  నేటి (బుధవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించనుంది. 15 నెలల వారెంటీతో పాటు కొనుగోలు చేసిన మొదటి నెలలో స్క్రీన్ రీప్లేస్ మెంట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పించనుంది. 4జీ కనెక్టివిటీతో ఆనర్ 5సీ వేరియంట్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఈ ఫోన్ కలిగిఉంది. అయితే ఇటీవల యూరప్ లో ఆవిష్కరించిన ఈ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కంపెనీ పొందుపర్చలేదు.    


హువాయ్ ఆనర్ 5సీ ఫీచర్లు....
5.20 అంగుళాల డిస్ ప్లే
1.7 జీహెచ్ జడ్
1080x1920 పిక్సెల్స్
 హైసిలికాన్ కిరిన్ 650 ఆక్టా కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
 డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్ కార్డులు)
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
13మెగా పిక్సెల్ వెనుక కెమెరా
8మెగా పిక్సెల్ ముందు కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
156 గ్రాముల బరువు

మరిన్ని వార్తలు