-

'నోట్ల’ వ్యవహారంలో కేంద్రం విఫలం

18 Dec, 2016 02:22 IST|Sakshi
'నోట్ల’ వ్యవహారంలో కేంద్రం విఫలం

మండలిలో చర్చ సందర్భంగా విపక్ష నేత షబ్బీర్‌ అలీ
అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే విమర్శించడంలో తప్పేముందన్న షబ్బీర్‌


సాక్షి, హైదరాబాద్‌: నల్లధనాన్ని అరికట్టడం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, నకిలీ నోట్ల చెల్లుబాటును అడ్డుకోవడమే లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణ యం తీసుకున్న కేంద్ర ప్రభు త్వం.. ఆ మూడు అంశాల్లోనూ పూర్తిగా విఫలమైందని శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపిం చారు. నోట్ల రద్దు అంశంపై శనివారం జరిగిన చర్చ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ.. జనం రోజువారీ పనులు మానుకుని కొత్త నోట్ల కోసం బ్యాం కులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. రోజుకో రకమైన ప్రక టనలతో కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు ప్రశాంతంగా ఉన్న ప్రజ లను భయకంపితులను చేస్తు న్నారని ఆరోపించారు.

ప్రధాని తాను అనుకున్నది సాధించ డంలో విఫలమయ్యారని అన డంతో అక్కడే ఉన్న సీఎం కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాలను తాము విమర్శించలేమని చెబుతూ వైఫల్యం అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని మండలి చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. షబ్బీర్‌ అలీ తిరిగి మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర నిర్ణయాలను విమర్శిం చడంలో తప్పేముందని ప్రశ్నించారు. గతంలో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ, మండలి తీర్మానాలు చేయలేదా అని గుర్తు చేశారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆదాయం పడిపోయినందున, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గతేంటని ప్రశ్నించారు.

ప్రధానిని కలసిన సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి హామీలిచ్చారో తెలిపాలని సీఎంను కోరారు. రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాకు 5,259 బ్యాంకులు ఏవిధంగా సేవలు అందించగలుగుతాయని ప్రశ్నించారు. 8 వేల ఏటీఎంలలో 80 శాతం పనిచేయడం లేదన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ అల్తాఫ్‌ రజ్వీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయం చిన్న వ్యాపారులను, మధ్య తరగతి వర్గాలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ.. కళ్లెదుట కనబడుతున్న కష్టాలను కాదనలేమని, ప్రధాని తీసుకున్న గొప్ప నిర్ణయంతో దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు