సూప్ చాలెంజ్..

14 Feb, 2014 00:07 IST|Sakshi
సూప్ చాలెంజ్..

ఇక్కడ పెద్ద గిన్నెలో సూప్ ముందేసుకుని కూర్చున్న ఈయన ‘ఫూ’ చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫూగార్డెన్ రెస్టారెంట్‌కు స్థానికంగా చాలా పేరుంది. ఇక్కడ ఎవరైనా సరే ఈ ఫూ సూప్ సవాల్‌కు సిద్ధమవ్వొచ్చు. 1.8 కిలోల నూడుల్స్, 1.8 కిలోల గొడ్డు మాంసంతో దీన్ని తయారుచేస్తారు. గంటలోపే ఈ ఫూ సూప్‌ను బ్రేవ్‌మనిపిస్తే.. సూప్ ఖరీదు రూ.1,400 కట్టాల్సిన పని ఉండదు. అంతేకాదు.. ఓ జ్ఞాపికనూ అందిస్తారు.

 

అయితే, 2008లో ఈ రెస్టారెంట్ పెట్టినప్పటి నుంచి రోజూ పదుల సంఖ్యలో జనం ఈ చాలెంజ్‌కు సిద్ధమవుతున్నా.. ఇప్పటివరకూ ఈ సూప్‌ను పూర్తిగా ఖాళీ చేసినవారి సంఖ్యను వేళ్ల మీద లెక్కగట్టవచ్చట.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా