-

ఎంత పెద్ద ఏనుగో...

1 Nov, 2015 05:00 IST|Sakshi
ఎంత పెద్ద ఏనుగో...

డైనోసార్ల కాలంనాటి భారీ ఏనుగు నీళ్లు తాగుతున్నట్లు ఉంది కదూ...! నిజానికి ఇది దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని హీమేయ్ దీవిలో సముద్రతీరంలో ఏర్పడిన లావా ఆకృతి. 1973లో ఇక్కడి ఎల్డ్‌ఫెల్ అనే అగ్నిపర్వతం బద్దలై లావాను వెదజిమ్మింది. దగ్గర్లోని హార్బర్‌ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్థానికులు చల్లని సముద్రపు నీటిని మోటర్ల సాయంతో లావాపై వెదజల్లారు. అప్పుడు ఏర్పడిందే ఈ ఏనుగు. పర్యాటకులకు ఇదో పెద్ద ఆకర్షణగా మారిందట.

మరిన్ని వార్తలు