మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!

1 Sep, 2015 09:43 IST|Sakshi
మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!

ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది గానీ మంత్రులు, ఇతర అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాల అవకాశం ఎలా వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నాడు అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

  • సీఎం దర్శకత్వంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి
  • సభను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారు
  • అనేక సమస్యలున్నాయి.. నిత్యావసరాల ధరలు, కరువు, రైతు ఆత్మహత్యలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు
  • చంద్రబాబు సినిమా పిచ్చికి బలైన పుష్కర ప్రాణాలున్నాయి
  • రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలను దిగజార్చిన ఓటుకు కోట్లు ఘటన ఉంది
  • రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది
  • అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే ఇన్నాళ్లూ ఉలుకూ పలుకు లేని చంద్రబాబు అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు
  • ఎట్టకేలకు వైఎస్ జగన్ ఒత్తిడితో టీడీపీ ముందుకొచ్చినా, అది తూతూ మంత్రంగానే ఉంది
  • నిన్న సీఎం 10 పేజీల స్టేట్మెంట్ చదివారు. అయితే, స్టేట్మెంట్లో అంటే ఆ నోట్లో ఉన్న విషయాలు మాత్రమే చదవాలి, దానిపై చర్చలో ఏమైనా చెప్పచ్చు.
  • కానీ దుర్మార్గంగా స్టేట్మెంట్ ఒక పేజీ చదువుతూనే అందులో లేని అంశాలను చెబుతూ జగన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు
  • జగన్ మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది. అధికార పక్షానికి మాత్రం 27 నిమిషాలు అవకాశం ఇస్తారు
  • చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలి.
  • సమస్యలున్నాయి గానీ, అవన్నీ ప్రత్యేక హోదా తర్వాతే
  • అసలు ఆ అంశమంటే ప్రభుత్వానికి భయమెందుకో నాకు అర్థం కావట్లేదు
  • ప్రత్యేకహోదా తీర్మానానికి ఒక విలువ ఉండాలంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులు రాజీనామా చేయాలి
  • అలా కాకుండా మాయమాటలతో ప్రభుత్వాన్ని మోసం చేయద్దు
  • ఢిల్లీలో ఒకమాట, హైదరాబాద్లో ఒకమాట చెబుతున్నారు
  • బీజేపీ మంత్రులు కూడా అప్పుడో మాట, ఇప్పుడోమాట అంటున్నారు
  • ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో ముందుకు రావాలి
  • అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి కాలపరిమితితో కూడిన తేదీని నిర్ణయించాలని కోరుతున్నాం
  • రెచ్చగొట్టే మాటలతో సభను నిలిపివేయడం కాకుండా సభను సజావుగా నడవనివ్వాలని కోరుతున్నాను

మరిన్ని వార్తలు