శాశ్వతంగా ఫేస్ బుక్ డిలీట్ చేయడం ఇలానే...

26 Feb, 2017 14:22 IST|Sakshi
శాశ్వతంగా ఫేస్ బుక్ డిలీట్ చేయడం ఇలానే...
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్బుక్ నుంచి వైదొలుగుద్దామని నిర్ణయించుకున్నారా? శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే  ఫేస్ బుక్ డిలీట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ను ఫాలో అయితే అకౌంట్ను శాశ్వతంగా డిలీట్ చేసేయొచ్చట.  డిలీట్ చేసిన అకౌంట్ను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవడానికి కూడా వీలుపడదట. ఈ ప్రక్రియతో మీరు షేర్ చేసిన ప్రొఫైల్ తో సహా మొత్తం శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. 
 
శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేసే పద్ధతి:
స్టెప్ 1: ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి, సెట్టింగ్స్ కు వెళ్లాలి.
స్టెప్ 2: జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ లో కిందుండే కాఫీ ఆఫ్ ఆల్ యువర్ ఫేస్ బుక్ డేటా 'డౌన్ లోడ్' ఆప్షన్ ను క్లిక్ చేయాలి. 
స్టెప్ 3:  https://www.facebook.com/help/delete_account  లింక్ లోకి వెళ్లాలి, డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
స్టెప్ 4: ఒక్కసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి, తుది ఆమోదం కోసం క్యాప్చా కోడ్ ఓ ఇమేజ్ రూపంలో డిస్ ప్లే అవుతోంది. 
 
ఫైనల్ గా ఫేస్ బుక్ మీ అకౌంట్ ను డిలీట్ చేస్తున్నట్టు నోటిఫై చేస్తోంది.  14 రోజుల లోపల మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 14 రోజుల్లో మీకు ఫేస్ బుక్ అకౌంట్ ను డిలీట్ చేసుకోవాలనిపించకపోతే, వెంటనే ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి డిలీట్ రిక్వెస్ట్ ను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. 90 రోజుల్లో మీరు పోస్టు చేసిన అన్ని పోస్టులు, ఫోటోలు, స్టేటస్ అప్ డేట్లు అన్నింటిన్నీ కంపెనీ శాశ్వతంగా డిలీట్ చేసేస్తుంది. 
మరిన్ని వార్తలు