గ్రీన్కార్డ్ హోల్డర్స్పై ట్రంప్ నిషేధ ప్రభావముందా?

30 Jan, 2017 17:51 IST|Sakshi
గ్రీన్కార్డ్ హోల్డర్స్పై ట్రంప్ నిషేధ ప్రభావముందా?
వాషింగ్టన్ : ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక ఎయిర్పోర్టు అధికారులు, ఏజెన్సీలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏడు దేశాలపై విధించిన ఈ నిషేధం గ్రీన్కార్డు హోల్డర్స్, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారికి ఎలా వర్తింపచేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ సందిగ్థత సమయంలోనే ట్రంప్ కార్యాలయంలోని టాప్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలను జోడిస్తున్నాయి.
 
ట్రంప్ ఆర్డర్లు గ్రీన్కార్డు హోల్డర్స్పై ఎలాంటి ప్రభావం చూపదంటూనే, నిషేధించిన ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాలకు చెందిన గ్రీన్కార్డు హోల్డర్స్పై ఈ ప్రభావం తప్పక ఉంటుందని వైట్హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రైయిన్స్ ప్రీబస్ పేర్కొన్నారు. ఏడు దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్కు ట్రంప్ ఆదేశాలను అమల్లోకి తెస్తామని మరో సీనియర్ అధికారి చెబుతున్నారు. కానీ అమెరికాకు తిరుగు ప్రయాణమై వచ్చే గ్రీన్ కార్డు హోల్డర్స్కు అదనపు స్క్రీనింగ్, ల్యాండింగ్ సమయంలోనే జాతీయ భద్రత తనిఖీలు నిర్వహించి దేశంలోకి అనుమతిస్తామని మరో హోమ్లాండ్ సెక్యురిటీ అధికారి చెబుతున్నారు.
 
గ్రీన్ కార్డు హోల్డర్స్ను పరిగణలోకి తీసుకొని, ట్రంప్ తన ఆర్డర్ను పునఃసమీక్షిస్తారని టాప్ జీఓపీ సెనెటరే పేర్కొంటున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్పై ఎవరూ సరియైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్‌ సర్కారు తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  మరోవైపు తను జారీచేసిన ఆదేశాలపైన తానే ఖండనలు ప్రారంభించారు ట్రంప్. అణచివేతకు గురవుతున్న వారిపై కరుణ చూపుతానని, కానీ తమ దేశంలోని పౌరులు, ఓటర్లనూ రక్షిస్తానని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఇది ముస్లిం నిషేధం కాదంటూ, మీడియానే దీన్ని తప్పుడుగా చిత్రీకరిస్తుందంటూ విమర్శించారు. కానీ ట్రంప్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అమెరికా మీడియా తెగేసి చెప్పింది.    

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?

ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!

ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!

వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా

'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా